శ్రీవారి దర్శనం ఇప్పట్లో చెప్పలేం..కాని లడ్డూలు మాత్రం సగం ధరకే..టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

రూ. 50 విలువైన లడ్డు రూ. 25కే
అన్ని జిల్లాల టీటీడీ కల్యాణమండపాల్లో అందుబాటులో
హైదరాబాద్ సమాచార కేంద్రంలో కూడా
టీటీడీలో నిధుల కొరత లేదన్న వైవీ
శ్రీవారి దర్శనాలు ఎప్పటి నుంచో ఇప్పుడే ఏమి చెప్పలేమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే భక్తులకు తీపి కబురు చెబుతూ లడ్డూ ధరలు మాత్రం  సగం ధరకే అంది చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రూ50 ఉన్న లడ్డు ధర ఇక నుండి రూ 25 లకే లభిస్తుంది.లాక్ డౌన్ నిబంధనలు తొలగేంత వరకూ భక్తులు  లడ్డూలను  సగం ధరకే విక్రయిస్తామని తెలిపారు.భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.అడిషనల్ ఈవో ధర్మారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన,స్వామివారి దర్శనాలు ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభం అవుతాయన్న విషయాన్ని చెప్పలేనని అన్నారు.ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న టీటీడీ కల్యాణ మండపాలతో పాటు హైదరాబాద్,న్నై, బెంగళూరు నగరాల్లో ఉన్న సమాచార కేంద్రాల్లో ప్రసాదాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

ఈ- హుండీ ద్వారా స్వామివారికి వస్తున్న ఆదాయం పెరిగిందని  గత సంవత్సరం ఏప్రిల్ లో రూ. 1.79 కోట్లు రాగా, ఈ సంవత్సరం రూ. 1.97 కోట్ల ఆదాయం కానుకల రూపంగా వచ్చిందన్నారు. టీటీడీలో నిధుల కొరత ఉందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేసిన ఆయన,ఆలయాల నిర్వహణకు, ఉద్యోగుల వేతనాలకు ఎలాంటి కొరతా లేదని, స్వామి అనుగ్రహంతో భవిష్యత్తులోనూ ఆ పరిస్థితి రాబోదన్న నమ్మకం ఉందని తెలిపారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు