దుర్మార్గం - రిపోర్టర్ ఇళ్లు కూల్చి వేయించిన నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే

కరోనా నిభందనలు పాటించలేదని వార్త ప్రసారం చేసిన న6 జర్నలిస్టు
కక్ష కట్టి ప్రతీకారం తీర్చుకున్న ఎమ్మెల్యే- నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చి వేయించిన ఎమ్మెల్యే
మండిపడిన జర్నలిస్టులు
కరోనా నిభందనలు పాటించకుండా నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జనం మద్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడని వి 6 రిపోర్టర్ న్యూస్ ప్రసారం చేసినందుకు కక్ష కట్టిన ఎమ్మెల్యే  నిర్మాణంలో ఉన్న ఆ రిపోర్టర్ ఇంటిని కూల్చి వేయించారు.ఈ సంఘటనపై జర్నలిస్టులు మండి పడ్డారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఒక జర్నలిస్టు పై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం దుర్మార్గమని జర్నలిస్టులు ఖండించారు.

నారాయణఖేడ్ రిపోర్టర్ పరమేశ్ ఇల్లు కూల్చివేయడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం తీవ్రంగా ఖండించింది. ఒక రిపోర్టర్ పంపించిన వార్తలు తీన్మార్ వార్తల్లో వాడుకోవడం డెస్క్ జర్నలిస్టుల చేసే పని... కనీసం ఈ విషయంలో అవగాహన లేకుండా స్థానిక జర్నలిస్టు ఇల్లును కూల్చివేయడం సదరు ఎమ్మెల్యే దుస్సాహసం. ఇప్పటికైనా  ఎమ్మెల్యే తన తప్పు తెలుసుకొని వెంటనే సదరు విలేకరి కి తిరిగి ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దౌర్జన్యాలను సహించే ప్రసక్తే లేదని యూనియన్ అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, TEMJU అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి లు తేల్చి చెప్పారు.
నారాయణ్ ఖేడ్ MLA భూపాల్ రెడ్డి దౌర్జన్యం పై మంత్రి హరీష్ రావుకు TUWJ ఫిర్యాదు:
మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ MLA భూపాల్ రెడ్డి లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదని న్యూస్ కవర్ చేసిన స్థానిక V6 రిపోర్టర్ పరమేష్ పై కక్షసాధిపు ధోరణితో రిపోర్టర్ నిర్మించుకుంటున్న ఇల్లును కూల్చి వేయించాడు. దీనిని TUWJ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కు ఫిర్యాదు చేయడం జరిగింది. TUWJ నాయకుల ఫిర్యాదుకు స్పందించిన మంత్రి రిపోర్టర్ కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి దాడులు కానీ, బెదిరింపు చర్యలు కానీ జగకుండా చూడాలని జర్నలిస్టు యూనియన్ నాయకులు మంత్రి హరీష్ రావును కోరారు. మంత్రిని కలిసిన వారిలో TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, TEMJU రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. రమణ కుమార్, TUWJ హైద్రాబాద్ అధ్యక్షుడు పి.యోగానంద్, తెంజు హైద్రాబాద్ నగర అధ్యక్షుడు జి. సంపత్,TUWJ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షు విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీధర్, సంగారెడ్డి జిల్లా నాయకులు యాదగిరి గౌడ్, యోగనంద్ రెడ్డి, ధారసింగ్ తదిరతరులు ఉన్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు