శ్రీవారి దర్శనానికి ఆన్ లైన్ టికెట్లు

భక్తులను శ్రీవారి దర్శనానికి సామాజిక దూరంతో అనుమతించాలని, సంఖ్యను దాదాపుగా కుదించేందుకు టీటీడీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించి దర్శనాలకు సంబంధించి విధి విధానాలతో కూడిన నిర్ణయాన్ని తీసు కోనుంది. శ్రీవారి దర్శనానికి భక్తులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినపక్షంలో టీటీడీ వారికి అవసరమైన దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించిన స్లాట్ల విధానాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌ లైన్‌ ద్వారా కేటాయించి టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి వద్ద అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలిపిరి, నడకమార్గంలో భక్తులను క్షుణంగా తనిఖి చేసిన అనంతరమే దర్శనానికి అనుమతిస్తారు. ప్రతి భక్తుడినీ ధర్మల్‌ స్కానింగ్‌ చేయడంతో పాటు శానిటైజేషన్‌ చేయనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు