జీహెచ్ఎంసీలో కరోనా తీవ్రత... తెలంగాణలో మరిన్ని కొత్త కేసులు


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా విజృంభిస్తోంది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 37 మందికి, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరికి, ముగ్గురు వలస కార్మికులకు కరోనా సోకినట్టు గుర్తించారు. మొత్తం 42 కొత్త కేసులు నమోదయ్యాయి.

దాంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,551కి పెరిగింది. నేడు 21 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 992కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 525 మంది చికిత్స పొందుతున్నారు. ఇక, కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. దాంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 34 వద్దే నిలిచిపోయింది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు