ప్రగతి భవన్ ఎదుట వ్యాపారి ఆత్మహత్య యత్నం

హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌కు చెందిన చెప్పుల వ్యాపారి నసీరుద్దీన్‌ ఆదివారం సాయంత్రం సీఎం క్యాంపు ఆఫీసు ప్రగతిభవన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా దుకాణం మూతపడటం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో.. నసీరుద్దీన్ తీవ్ర వేదనకు గురయ్యాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.


వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడు నిప్పు అంటించుకోకుండా అడ్డుకొని.. పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని నసీరుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేశానని నసీరుద్దీన్ తెలిపారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు