పదో తరగతి విద్యార్థులకు...ఇళ్ల దగ్గరే ఎగ్జామ్‌ సెంటర్స్‌....


కరోనా వైర‌స్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి ఎగ్జామ్ సెంటర్స్ విషయంలో ఏపీ స‌ర్కార్ నూతన విధానాన్ని అమ‌లు చేయ‌బోతుంది. విద్యార్థుల ఇళ్లకు దగ్గర్లోనే ఎగ్జామ్ సెంట‌ర్స్ కేటాయించేందుకు కసరత్తు చేస్తోంది.

పట్టణాలు, నగరాల్లో హాస్ట‌ల్స్ లో ఉండి పదో తరగతి చదివిన స్టూడెంట్స్ లాక్‌డౌన్‌తో సొంత ఊర్ల‌కు వెళ్లారు. చదివిన స్కూల్ ప్రకారం సెంట‌ర్స్ కేటాయిస్తే వారంతా తిరిగి వచ్చి.. వారం పాటు ఉండి ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వారి నివాసానికి దగ్గరలోనే ఎగ్జామ్ సెంట‌ర్స్ కేటాయించాలని భావిస్తోంది.

షెడ్యూల్‌ :
జూలై 10న ఫస్ట్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)

జూలై11న సెకండ్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)

జూలై 12న ఇంగ్లీషు (9.30am- 12.45pm)

జూలై 13న మ్యాథ్స్ ‌(9.30am- 12.45pm)

జూలై14న జనరల్ సైన్స్ (9.30am- 12.45pm)

జూలై 15న సోషల్ స్టడీస్‌ (9.30am- 12.45pm)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు