పేరిణి నృత్యవైభవం

శివతత్వానికి ప్రతి రూపమే ఓంకార స్వరూపం. ఇలాంటి ఓంకార తత్వమైన యోగానికి శివతత్వం మిళితమై రూపొందించబడిన నృత్యమే పేరిణి నర్తనం. వీరరస ప్రధానమైన శబ్దంతో కూడిన జతులతో ‘ఓం’కార నాదాన్ని ‘తాం’ అనే శబ్దంతో నిరంతరం నిరూపించి ప్రదర్శించగలిగే శక్తి పేరిణి సొంతం. దృపద బాణిలోని మృదంగ గంభీర శబ్ద విన్యాసాలకు శరీరంలో కలిగే కదలికలు, ఓంకార నాద మిళితమైన జతులు, కట్టుబాట్లు, ప్రకంపనాలతో సాక్షాత్తు పరమశివుడే శివతాండవం ఆడుతున్నాడా అనే అనుభూతిని కల్పించడమే పేరిణి ప్రత్యేకత. పురుషులు మాత్రమే చేయగలిగే పురుష సాంప్రదాయ నాట్యం ప్రపంచంలో ఇదొక్కటే. పేరిణి నృత్యానికి సంబంధించిన పలు వర్ణనలు పాల్కురికి సోమనాధుడు రాసిన ‘పండితారాధ్య చరివూత’లోను, శ్రీనాధ మహాకవి రాసిన ‘కాశీఖండం’లోనూ, భీమఖండంలోనూ, సర్వజ్ఞ కుమార యాచేంవూదుడు రాసిన’ సభారంజని’లోను, నందికేశ్వరుడు రాసిన ‘భరతార్ణవం’లో ఉన్నాయి. అయితే, నృత్తరత్నావళిలో జాయప ఒక్కడే నృత్యాల్లో ఉపయోగించవలసిన సంగీత రీతులు, మృదంగ జతి కట్టుబాట్లను ప్రస్తావించడమేకాక ఒకటి రెండు చోట్ల, ఆయా స్వరపోకడలు, జతి విన్యాసాల గురించి వివరించాడు. ఐతే, కేవలం నాట్యం గురించే కాకుండా నాట్యానికి ప్రయోగించిన సంగీత బాణీలను కూడా వివరించాడు.
గర్ఘరం
నాట్యంలో అనేక విధాలుగా గజ్జెలను పలికిస్తూ ఆడటం గర్ఘరం. ప్రారంభంలో నర్తకులు సమపాదంలో నిలబడి, తర్వాత కాళ్లను పలువిధాలుగా కదిలిస్తూ, కింకిణులను పలువిధాలుగా ధ్వనింపచేస్తూ నృత్యం చేయడమే దీని ప్రధాన లక్షణం. ఇది పటవాటం, పటవం, సూరిపట్టెం, లకాదిమి, సిరిబిరం, హరిబిడం అని ఆరు విధాలు. ఈ అడుగు క్రమమే పేరిణి పాద విన్యాసానికి మూలం. దీనినుంచే వివిధ అడుగులు, అడవులు, చారీ, రేచకాలు రూపొందాయి. ఈ క్రమాన్నే ‘మేళవూపాప్తి’ అంటారు.
విషమం
ఆకాశచారీ, భూచారీ విన్యాసాలతో వివిధ మృదంగ జతులకు, గతులకు నృత్యం చేయడమే విషమం. దీనిలో ప్రతి విన్యాసం చారీతో ప్రారంభమై, ఒక జాతి విన్యాస ప్రదర్శనానంతరం తీర్మానంతో ముగుస్తుంది. ఇతర నృత్యశైలులలో మూడుసార్లు ఆడి ముగించే తీర్మానానికి భిన్నంగా దీనిలో తీర్మానాన్ని ఐదుసార్లు ప్రదర్శించి, ముగించడం సంప్రాదాయం, ఇది నాద-నృత్త మిక్షిశమం. దీనిని ‘లయాక్షిశిత నృత్యం’గా పేర్కొనవచ్చు.
భావాక్షిశయం
దీనిలో లయ విన్యాసాన్ని తెలియజేసే నృత్యమేకాక, ముద్రిక, కరణాంగ హారాలచే భావ ప్రకటనను సూచించడానికి అనువైన శివగీతాలను ధృవాగాన పద్ధతిలో చేస్తారు. దీనిలోని భంగిమలు చూడముచ్చటగా ఉంటాయి.
కవివారం
దీనిలో భగవంతుని గుణకీర్తనం చేసే స్తోత్రగీతాలకు నృత్త, నృత్యాలు రెండింటినీ నర్తకులు ప్రదర్శిస్తారు. రుద్ర, బ్రహ్మ మొదలైన ప్రత్యేక తాళాల సంచారం ఇందులో ఉంటాయి.
గీతం
దీనిలో కైవార ప్రబంధ గీతాలకు నృత్త, నృత్యాలను ప్రదర్శిస్తారు. ఈ ఐదు అంగాలు పేరిణి తాండవం వీరరస ప్రాధాన్యం గల ఉధృతమైన నృత్యశైలిని తెలియజేస్తాయి. నర్తనం చేస్తున్నప్పుడు నర్తకుడు ఆ శివుని ఆవాహన చేసుకోవటానికి మనసును ప్రకోపింప చేసుకొని, తన శరీరంలోని ప్రతీ అణువులోని శివదేవుని శక్తిని ఆవహింపచేసుకుంటారు. ఆ పిమ్మట శివశక్తితో ప్రజ్వరిల్లిన తన శరీరంలోని అంగాలతో తానుగాక, సాక్షాత్తు ఆ శివుడే ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు నర్తకుడు నర్తిస్తాడు. కనుకనే కాకతీయ వీరసైనికులు ఈ పేరిణి తాండవాన్ని వీక్షించి ఆ శివదేవుని ప్రేరణతో ఎంతో ఉత్తేజితులై, ఉగ్రతతో కదన రంగానికి వెళ్లి శత్రువులను ఎదిరించారు. ఇంతటి అపురూప నృత్య సంప్రదాయం కాకతీయుల కాలంలో దేదీప్యమానంగా ఒక వెలుగు వెలిగింది. తర్వాత పూర్తిగా అంతరించి పోయింది. ఆ తర్వాత 800ఏళ్లకు నటరాజ రామకృష్ణ కృషితో పునఃసృష్టి జరిగి మన దేశంలోని తాండవ నృత్యరీతులకు తలమానికంగా నిలిచింది.
పేరిణికి ప్రఖ్యాతి తెచ్చిన నటరాజు

కాకతీయుల కాలంలో దేదీప్యమానంగా వెలిగి, తర్వాత పూర్తిగా మరుగునపడిన పేరిణి నర్తనాన్ని పునఃసృష్టి చేసిన ప్రముఖులు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ. ఆయన జాయప నృత్తరత్నావళిలోని మార్గ, దేశి నృత్యాలను వేరువేరుగా వివరించడమే కాకుండా ఆనాడు ప్రచారంలో ఉన్న దేశి నృత్య సంప్రదాయాలను వివరించడంతోపాటు శాస్త్ర సంబంధమైన ఇతర విషయాలను విశ్లేషించారు. రామప్ప దేవాలయంలోని శిల్పభంగిమలలో జీవత్వాన్ని దర్శించి పేరిణికి ప్రపంచ ప్రఖ్యాతి కల్పించారు. 1984లో , అలాగే 1992లలో నటరాజ రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయన శిష్యగణం రామప్ప ఆలయం ముంగిట ‘పేరిణి శివతాండవం’ నృత్యం ప్రదర్శించి ఆలయకీర్తినీ ఇనుమడింపచేశారు.800 సంవత్సరాల చరిత్ర కలిగిన పేరిణి కాకతీయ సామ్రాజ్య పతనానంతరం మరుగున పడింది. దానికి పునరుజ్జీవనం కల్పించి కొత్త ప్రసరించడానికి నటరాజ రామకృష్ణ 45 సార్లు రామప్ప ఆలయాన్ని సందర్శించి నృత్యభంగిమలను పరిశీలించారు. శైవాగమం, సప్తతాండవాలు, నాదోత్పత్తి, నాదోవికాసం, నాద అంతాలపై విశేష పరిశోధన చేసి పేరిణికి జవజీవాలు కల్పించారు.
March 6, 2013

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు