సినిమాల్లో అలాంటి సీన్స్ ఏవి ఉండబోవట ?

సినిమాల్లో రొమాన్స్ సీన్లు ఇక నుండి  దర్శనం చేయ బోవట.  లిప్‌ లాకులు, రొమాన్స్ ఇప్పటి సినిమాల్లో సర్వసాధారణం అయిపోయాయి. అయితే, ఇకపై కొన్నాళ్లపాటు ఇలాంటి సీన్స్ సినిమాల్లో కనిపించకపోవచ్చు. లాక్‌డౌన్ తరవాత షూటింగ్‌లు మొదలైనా సినిమాల్లో సన్నిహితంగా మెదిలే సన్నివేశాలు ఉండవని సమాచారం. ఈ మేరకు భారత ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమలకు నియమ నిబంధనలు రానున్నాయట.

కోవిడ్-19 లాక్‌డౌన్ తరవాత షూటింగ్‌లకు అనుమతులు ఇవ్వడానికి, నియమ నిబంధనలను సెట్ చేయడానికి 20 దేశాలకు చెందిన సినిమా ప్రతినిధులు మే 11వ తేదీన ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇండియా, యూకే, యూఎస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వీరంతా షూటింగ్‌లు ప్రారంభమైన తరవాత పెట్టాల్సిన నియమ నిబంధనల గురించి చర్చించారు. ఇండియా నుంచి సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, చైర్ పర్సన్ అమిత్ బేల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జరిగిన చర్చల గురించి అమిత్ తాజాగా వెల్లడించారు. అసలు ఆయా దేశాలతో భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏంటో చెప్పారు.

‘‘ఇండియా లాంటి పెద్ద దేశాలు షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అలాగే, ఫారిన్ ప్రొడక్షన్స్ ఇక్కడికి వస్తుంటాయి. అందుకే, షూటింగ్‌లు ప్రారంభించడానికి ముందు మేం అంతర్జాతీయంగా కలిసి పనిచేయాలి. ఒకవేళ రెండోసారి ఇలాంటి ప్రమాదమే సంభవిస్తే, మనం దానిని ఎదుర్కోవడానికి కచ్చితంగా సిద్ధంగా ఉండాలి. మనం షూటింగ్‌లను పున:ప్రారంభించుకోవాలి, కానీ దానివల్ల ఎవరి జీవితం బలికాకూడదు’’ అని అమిత్ వివరించారు.
అలాగే, సినిమాటిక్ ఇంటిమెసీ (సినిమాల్లో సాన్నిహిత్యం) గురించి కూడా కీలక చర్చ జరిగిందని అమిత్ చెప్పారు. సెట్స్‌లో వైరాలజిస్టులను ఉంచడంతో పాటు ఇతర మార్గదర్శకాల గురించి చర్చించారట. వైరస్ వ్యాప్తిని నిర్మూలించడానికి మార్గదర్శకాలను ప్రభుత్వాలు, స్టేట్ మున్సిపల్ కార్పోరేషన్లు విడుదల చేస్తాయని అమిత్ వెల్లడించారు. ఈ చర్చలు, ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా ఉన్నా.. లాక్‌డౌన్ తరవాత వచ్చే సినిమాలు గతంలో మాదిరిగా ఉండవన్నది మాత్రం నిజం. సినీ ప్రేమికులు ఈ విషయాలను జీర్ణించుకోవడం కష్టమే అయినా తప్పదు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు