గాడ్సే పై ట్వీట్.....నాగబాబును వెనకేసు కొచ్చిన వర్మ

మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే నిజమైన దేశభక్తుడంటూ సిని నటుడు,జన సేన పార్టి నాయకుడు నాగబాబు చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో నాగబాబు ట్విట్ పై విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి.నాగబాబు వివరణ ఇచ్చుకున్నా చర్చ ఆగడం లేదు. ఎబిఎన్ చానెల్ నాగబాబు వ్యాఖ్యలపై వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ చేత చర్చ జరిపింది. నాగబాబు ను తాను సమర్దిస్తున్నానని రాం గోపాల్ వర్మ చెప్పాడు. అంతేకాదు గాడ్సే గొప్ప దేశ భక్తుడంటూ ఆయనపై సినిమా చేస్తానంటూ చెప్పాడు.గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా నాగబాబు చేసిన ట్వీట్ సంచలనమైంది. ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
 గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది చర్చనీయాంశమేనని, కానీ అతని వైపు వాదనని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.ప్రభుత్వానికి లోబడి ఆనాడు మీడియా పనిచేసిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తాజా వివాదానికి దారి తీశాయి. అయితే తన ట్వీట్‌పై నాగబాబు వివరణ ఇచ్చుకున్నప్పటికి  జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్  ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.నాగబాబు ట్వట్టర్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం లేపుతున్నాయి.

"దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి.నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు.నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం. ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వాళ్ల కన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం" అని నాగబాబు వవిరణ ఇచ్చుకున్నారు.
ఆర్ఎస్ ఎస్ నేపద్యం కలిగిన పలువురు గతంలో గాడ్సే దేశ భక్తుడంటూ పొగిడిన సంధర్భాలు అనేకం ఉన్నాయి.ఇప్పుడు నాగబాబు ట్వీట్ తో చర్చ మళ్లి మొదలైంది.గాంధి,గాడ్సే ల చరిత్రలు చర్చల్లో మళ్లి తిరగేస్తున్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు