కాలాపానీ మాదే...నేపాల్ కొత్త కహాని



డ్రాగన్ అండతో నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ పార్లమెంట్‌లో ప్రత్యేక తీర్మానం
అధికారికంగా నేపాల్ ప్రభుత్వం  కొత్తగా రూపొందించిన మ్యాప్ లో లిపులేఖ్,కాలాపానీ,లింపియధుర

డ్రాగన్ చంకన చేరిపోయిన నేపాల్ భారత్ పై ఒంటి కాలిపై లేస్తోంది.భారత్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న కాలాపానీతో పాటు దానికి పశ్చిమాన ఉన్న లిపులేఖ్ సంధిమార్గం తమవేనంటూ నేపాల్ ప్రభుత్వం కొత్త కహాని మొదలు పెట్టింది.ఇదంతా చైనా కనుసన్నల్లో జరగుతున్నదని భారత్ అనుమానిస్తోంది.కాలాపానీతో పాటు లిపు లేఖ్ సంది మార్గం తమవే నని చెప్పుకోవడంతో ఆగి పోలేదు.ఏకంగా అధికారికంగా నేపాల్ ప్రభుత్వం  కొత్తగా రూపొందించిన మ్యాప్ లో చేర్చింది.
కొత్త మ్యాప్‌కు ఆ దేశ కేబినెట్‌ ఆమోదం కూడ తెలిపింది.కాబినెట్ ఆమోద ముద్రకూడ వేసింది.పార్లమెంట్ లో నేపాల్‌ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ ఈ విషయంపై ప్రత్యేకంగా ప్రసంగించారు.లిపులేఖ్,కాలాపానీ,లింపియధుర మూడు ప్రాంతాలూ తమవేననీ,రాజకీయ,దౌత్య మార్గాల ద్వారా వాటిని భారత్‌ నుంచి తిరిగి పొందుతామని  అన్నారు.అధికార నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ పార్లమెంట్‌లో ప్రత్యేక తీర్మానం కూడ ఆమోదించింది.లిపులేఖ్,కాలాపానీ,లింపియధుర ప్రాంతాలలో భారత సైన్యం చాలా కాలంగా ఉంటూ వస్తోంది.కాలాపానీలో 1962 నుంచి భారత సైన్యం ఉంటోంది.
వాస్తవంగా కాలాపానీ ప్రాంతం భారత్ లోని  ఉత్తరాఖండ్ రాష్ర్టం పితోర్ ఘర్ జిల్లాలో ఉంది.లిపులేఖ్,కాలాపానీ,లింపియధుర ప్రాంతాల కోసం భారత్,నేపాల్‌ల మధ్య వివాదాలు పాతవే.అయితే నేపాల్ వివాదానికి తెర లేపడం వెనక డ్రాగన్ వ్యూహ రచన ఉందని అంటున్నారు.భారత్ పొరుగు దేశాలన్నింటిని డ్రాగన్ తన చెప్పుచేతల్లో ఉంచుకుని భారత్ పై ఎగ దోస్తూ  వివాదాలకు ఆజ్యం పోస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి.పాకిస్తాన్,మయన్మార్,శ్రీలంక,భూటాన్ దేశాలు భారత్ పట్ల సహాయ నిరాకరణ ధోరణి అవలం బిస్తున్నాయి.గతేడాది అక్టోబర్ లో భారత్ విడుదల చేసిన మ్యాప్ లో ఈ మూడు ప్రాంతాలు తమ భూభాగంలో ఉన్నట్లు చూపించారు.దీనిపై నేపాల్ అభ్యంతరాలు లేవనెత్తింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు