ఆ చిరుత వెళ్లిపోయిందట


నగరంలో సంచరించి కలకలంరేపిన  చిరుత గురించి ఇక భయపడాల్సిన అవసరం లేదని అటవి సాక అధికారులు అభయం ఇచ్చారు. చిరుత అడవిలోకి వెళ్లిపోయిందని భయపడాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు. ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాకపోతే.. కొంచెం అప్రమత్తంగా ఉండాలని చుట్టుపక్కల గ్రామస్థులకు సూచించారు. అయితే హిమాయత్‌సాగ్‌ జలాశయం దగ్గర్లోని అజీజ్‌నగర్‌, కవ్వగూడ, నాగిరెడ్డిగూడ ప్రాంతాల్లో చిరుత కనిపించిందని స్థానికులు చెప్పినప్పటికీ.. అధికారులకు ఎలాంటి ఆధారాలూ లభించలేదు. కానీ, ఆ గ్రామస్థులకు మా త్రం కంటిమీద కునుకు లేకుండా పోయింది. రాజేంద్రనగర్‌లోని వ్యవ సాయ విశ్వవిద్యాలయం, ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌, నార్మ్‌, మేనెజ్‌ ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులు రాత్రిపూట విధులు నిర్వర్తిస్తుంటారు. నాలుగు రోజులుగా వీరు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని డ్యూటి చేస్తున్నారు.
యాదాద్రిలో చిరుత కలకలం
యాదగిరిగుట్టకు ఎదురుగా ఉన్న పెద్దగుట్టపై చిరుత సంచరిస్తున్నదన్న సమాచారంతో అటవి శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సుచరిత ఆధ్వర్యంలో అటవీ అధికారులు చిరుత కోసం గాలించారు. అయితే ఎక్కడా చిరుత జాడ కనిపించ లేదు. దేవస్థానానికి ఎదురుగా ఉన్న కొండపై చిరుత సంచరిస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు