రుద్రమదేవి రూపం!

రుద్రమదేవి కీర్తి ప్రతిష్టల గురించి చాలామంది వినే ఉంటారు. కానీ, వాటిని ప్రతిఫలింపజేసే శిల్పాలు, నాణాలు పెద్దగా వెలుగులోకి రాలేదు. అందుకే ఈ సచిత్ర వ్యాసం…

ఒక తెలుగు రాజ్యాన్ని సుమారు మూడు దశాబ్దాల పాటు నకీ.శ.1262-1289) ఏకఛవూతాధిపత్యంగా పరిపాలించిన ఏకైక తెలుగు రాణి రుద్రమదేవి అనే చెప్పాలి. నిజానికి ఇక్కడే తెలిసిపోతుంది, ఆమె ఎంతటి సాహసికురాలో! అయితే, ఆనాడు రాజలు, సామంతులు అందరూ పురుషులే. వారంతా ఒక మహిళ రాజ్యమేలడాన్ని భరించలేకపోయారు. ‘స్త్రీ రాజరికాన్ని’ జీర్ణించుకోలేకపోయారు. కొందరు ఆమె రాజ్యానికి వాయువ్య దిశన ప్రస్తుతపు మహారాష్ట్రలోని దేవగిరి రాజ్యపు యాదవరాజైన మహాదేవుడిని ఓరుగల్లుపై దండెత్తడానికి ప్రోత్సహించారు. ఆ రాజు ఓరుగల్లు కోటను ముట్టడించాడు కూడా. కానీ, రుద్రమదేవి సాహసానికి ఆ రాజు సేనలు చిత్తయి పారిపోయాయి. రుద్రమ అతడి శత్రు సైన్యాలను తరుముకుంటూ పోయి ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బీదరు కోటను వశపర్చుకుంది. తన విజయాన్ని ప్రస్తావిస్తూ అక్కడ కన్నడ భాషలో శిలాశాసనాన్ని కూడా వేయించింది. అందులో తన తండ్రి గణపతిదేవుని బిరుదు ‘రాయగజ కేసరి’ని తాను ధరించినట్లుగా ఉంది. ‘రాయగజ కేసరి’ అంటే ఏనుగుల వంటి శత్రురాజులకు సింహం వంటిది’ అని అర్థం.
అయితే, రాణి రుద్రమదేవి బీదరు కోటను వశపర్చుకున్నది మొదలు ‘రాయగజ కేసరి’ శిల్పాలను దేవాలయ స్తంభాలపైనా చెక్కించింది. అదే నమూనాను నాణేలపై కూడా ముద్రింపజేసింది. అయితే, అలా చెక్కించడం వెనుక రుద్రమ అహంభావం కాదు, ఆమె ఆత్మవిశ్వాసమే వ్యక్తమౌతుంది. వీటిద్వారా శత్రువులను గెలవగలనన్న ధీమాను కూడా ఆమె వ్యక్తం చేసిందనుకోవచ్చు. ఇవన్నీ ఆనాటి స్త్రీలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే చర్యలుగానూ మనం చూడవచ్చు.
రాయగజకేసరి శిల్పాలు
చాలా నునుపైన, అందమైన నల ్లసానపు ‘రాయగజ కేసరి’ శిల్పం ఒకటి రామప్ప గుడి దక్షిణ ద్వారపు స్తంభంపైన చూరును మోస్తున్నట్లుగా ఉంది. ఈ శిల్పంలో ఏనుగును అణగదొక్కుతున్న సింహం, మరొక స్త్రీ మూర్తి చెక్కబడ్డాయి. ఈ శిల్పం రాయగజ కేసరి శిల్పం కాబట్టి, ఈ శిల్పంలోని స్త్రీకి కాళ్ళకు మెట్టెలు కూడా ఉన్నందువల్ల ఈ శిల్పం రుద్రమదేవిదే అని, పైగా ఆమెనే ఆ శిల్పాన్ని చెక్కించిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇదే అభివూపాయాన్ని కాకతీయ చరివూతకారులు డా॥ పి.వి.పరవూబహ్మశాస్త్రి కూడా వ్యక్తం చేశారు. ‘‘రామప్ప గుడి నిర్మాణం క్రీ.శ. 1213లో పూర్తయినా ఇలాంటి శిల్పాలు, అలంకరణ శిల్పాలు ఎన్నో మరో శతాబ్దం పాటు కూడా చేర్చబడ్డాయి’’ అని అంటారాయన.
మరో మూడు రకాల రాయగజ కేసరి శిల్పాలు ఓరుగల్లు కోటలోని స్వయంభు దేవాలయ శిథిల శిల్పాల్లో ఉన్నాయి. ఒక శిల్పంలో సింహం తన ముందటి కుడి కాలును ఎత్తి గర్జిస్తూ ముందుకు ఉరుకుతున్నట్లుగా దానిపైన ఒక వీరవనిత కుడి చేత్తో కత్తి, ఎడమ చేతితో డాలు పట్టుకుని కుడికాలునెత్తి యుద్ధరంగంలోకి దూకుతున్నట్లుగా ఉంది. ఈ వీర వనిత ఎవరో కాదు రుద్రమదేవే.
రుద్రమ, దేవగిరి యాదవ రాజుపైన గెలిచినంక స్వయంభు దేవాలయంలో ఒక శిల్పాలంకృత మంటపాన్ని కట్టించి, ఆ మంటపం నాలుగు స్తంభాలకు నాలుగు ఇలాంటి రాయగజ కేసరి శిల్పాలను చెక్కించింది. వాటిని ఇప్పటికీ మనం చూడవచ్చు.
రెండవ రకం గజకేసరి శిల్పాల్లో ఏనుగుపైన విజృంభించిన సింహం వీపుమీద ఒక స్త్రీ కూర్చుని, వెనుకకు వాలి ఆ సింహం తోకను కత్తితో కోయడానికి సిద్ధమవుతున్నట్లుంది. ఈ శిల్పం కూడా రుద్రమదేవిదే, ఆమె చెక్కించిందే. ఇందులో ఆమె శత్రు రాజులకు చేస్తున్న హెచ్చరిక కన్పిస్తుంది.
పైన చెప్పిన శిల్పానికి ఆనుకుని మరో శిల్పం మూడవ రూపుది. ఇందులో రాయగజకేసరిపైన ఒక బాలుడు పడుకుని ఆడుతున్నట్లు ఉంటుంది. ఆ బాలుడు ప్రతాపరువూదుడు. రుద్రమదేవి బిడ్డ కొడుకు. ఇతడే రుద్రమ దత్త కొడుకుగా ఆమె తర్వాత కాకతీయ రాజు అయ్యాడు. రుద్రమదేవి తన తర్వాత రాజు కాబోయేవాడు కూడా ‘రాయగజ కేసరి’ వంటి వీరుడే అని శత్రురాజులను హెచ్చరిస్తూ ఆ శిల్పాన్ని చెక్కించిందని అర్థం చేసుకోవచ్చు.
అయితే, ఇంకో సంగతి కూడా ఉంది. రుద్రమకు కొడుకులు లేరు కాబట్టి, ప్రతాపరువూదున్ని అల్లారు ముద్దుగా ఆడిస్తూ పెంచింది. దీనికి నిదర్శనంగా మనకు రామప్ప దగ్గరి కటాక్షపురం దేవాలయంలో మరో శిల్పం కనిపిస్తుంది. అందులో రుద్రమ ప్రతాపున్ని తనతో పాటు హంసమీద కూర్చో పెట్టుకుని ఆడిస్తున్నట్లుగా ఉంది. అలాగే, రామప్ప గుడి ఉత్తరపు గోడపైన – కామ శిల్పాల పక్కన – ఖడ్గధారిణియైన రుద్రమ శిల్పం పక్కనున్న మరో శిల్పంలో రుద్రమతోపాటు బాల ప్రతాపుడు కూడా కనిపిస్తాడు.
నాణాలపై ముద్రలు
రుద్రమదేవి తన బిరుదైన ‘రాయగజ కేసరి’ని శిల్పాల్లోనే కాకుండా అదే బిరుదుతో కూడిన తన రూపాన్ని బంగారు నాణేలపై కూడా చెక్కించింది. అలాంటి ఆమె రూప నాణాలు కొన్ని హనుమకొండలోని పద్మాక్షిగుట్టపైన దొరికాయి. ఆ నాణేల్లో కొన్ని ‘మండ మండని’ అనే అక్షరాలు చెక్కినవి కూడా ఉన్నాయి. ‘మండ మండని’ బిరుదు కూడా రుద్రమకే వర్తిస్తుంది. ఆ నాణెంపై ఆమె గుర్రం మీద ఎక్కీ చేతుల్లో బల్లెం, డాలు పట్టుకుని నలువైపులా సైన్యం తోడు రాగా యుద్ధరంగంలో విహరిస్తున్నట్లుగా చిత్రించబడింది. అలాగే, రామప్పగుడి గోడపైన ఉన్న ఒక శిల్పంలో రుద్రమదేవి కాలును ఒక ఏనుగు తొండంతో పట్టుకోగా మరో ఏనుగు గదను ఎత్తుతున్నట్లుండగా వాటిని రుద్రమ కత్తి డాలుతో ఎదుర్కొంటున్నట్లుగా చిత్రితమైంది.
సంక్షేమ కీర్తి శిల్పాలు
తన తండ్రిలాగే రుద్రమదేవి కూడా ప్రజలను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేదనడానికి నిదర్శనంగా ఆనాటి శాసనాలు, కావ్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. తన రాజ్యంలో ఏ మూలన, ఏ ఒక్కరికీ బాధ కలిగినా తనకు తెలిస్తే వీలు చూసుకుని అక్కడికి వెళ్ళి మరీ వారి బాధలను తీర్చేదనడానికి నిదర్శనమైన ‘హృదయశల్యం’ అనే మాడపాటి హనుమంతరావు వందేళ్ళ నాటి వాస్తవికాధార కథను ‘బతుకమ్మ’ ఫిబ్రవరి 3 నాటి సంచికలో చదివాం. ఇలాంటి ఆత్మీయమైన వ్యక్తిత్వం వల్ల రుద్రమకు ప్రజలు నీరాజనాలు పట్టారు. ఆమెను ‘అంబ’ (అమ్మ) అనీ పిలిచారు. అంబతో సమానంగా…అంటే, దేవతతో సమానంగా కొనియాడారు. ఈ భావనలను తెలిపే శిల్పాలు కూడా ఆనాడే చెక్కబడ్డాయి.
అలాంటి శిల్పాల్లో ప్రధానంగా చూడవలసిన శిల్పం ఒకటి రామప్ప గుడిలోని మంటపం నైరుతి మూలలో ఉంది. ఇది ఎర్ర రాతి శిల్పం. ఈ శిల్పంలో రెండు ఏనుగులపైన ఎక్కిన ఇద్దరు స్త్రీలు రెండు రాజఛత్రాలను (గొడుగులను) ఎత్తి పట్టుకోగా వారి మధ్యన ఏనుగుపైన రుద్రమదేవి కత్తి ధరించి ఊరేగుతున్నట్లుంది. ఇలాంటి శిల్పమే మరొకటి మంథని దగ్గర గోదావరి నదిలోని లంజ మడుగు పైనున్న గుహాలయ గోడపై చెక్కి ఉంది. ఈ శిల్పంలో రుద్రమదేవి సేవికతో సహా గుర్రం పైన తన రాజ్యంలో విహరిస్తున్నట్లుంది. ఆమె గుర్రం వెనుక, పక్కల మంత్రిణి, పరిచారికలు ప్రయాణిస్తున్నట్లు చెక్కి ఉన్నది.
రుద్రమదేవిని తల్లిగా, దేవతగా కొలిచే భావనను తెలిపే శిల్పాలు కూడా రామప్ప గుడిలో ఉన్నాయి. నాట్య మండపంలోని ఒక స్తంభానికి మధ్య భాగంలో ఉన్నత స్థానంలో కూర్చున్న ఒక స్త్రీకి కుడి ఎడమల ముగ్గురేసి స్త్రీలు చేతుపూత్తి నమస్కారం చేస్తున్నట్లు, ఇద్దరేమో వంగి కూర్చుని అంజలి ఘటిస్తున్నట్లు చెక్కబడింది. ఈ శిల్పంలోని స్త్రీ కూడా రుద్రమదేవే. ఇక గుడిలోని అభిషేక జలం బయటికి వచ్చే దగ్గరున్న నల్ల సానపు విడి శిల్పంలో సింహం పైన కూర్చున్న చతుర్భుజ స్త్రీ దేవతలో కూడా రుద్రమదేవిని శిల్పించినట్లుగానే తోస్తుంది. రుద్రమపై ప్రజలకున్న అపార ప్రేమ భక్తికి దృష్టాంత శిల్పమది.
‘కంచుకోటను రక్షిస్తున్న అశ్వయుత రుద్రమ’
రుద్రమ్మను ఇంతగా శిల్పాల్లో ప్రేమించిన ప్రజలు, కళాకారులు ఆమెను చిత్రాల్లో కూడా ప్రేమించకుండా ఉంటారా? ఆనాడు ఓరుగల్లులో వేల సంఖ్యలో చిత్రశాలలుండేవని సమకాలీన సాహిత్యాధారాలు తెలుపుతున్నాయి. కానీ, దురదృష్టవశాత్తు మనకు రుద్రమ చిత్రం ఆనాటిది ఒక్కటి కూడా అందుబాటులో లేదు. కారణం ఆనాటి చిత్రాలు గోడలు, పత్రాలపైన వేసినవి కావడం, అవి కాలగర్భంలో కలసిపోవడం అనుకోవచ్చు. అయితే, మన నిస్పృహను కొంత వరకు తగ్గించడానికా అన్నట్లు ప్రముఖ తెలంగాణ చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావు 18-2-2000 నాడు ‘తను కట్టించిన కంచుకోటను సంరక్షిస్తున్న అశ్వయుత రుద్రమదేవిని’ చిత్రించారు. ఆయన వేసిన బొమ్మమీద ఆయనకే తనివి తీరక 25.03. 2000 నాటికి అదే బొమ్మను మరింత అందంగా చిత్రించారు. మరింత సమక్షిగంగా ఉండేలానూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ నిలు బొమ్మ ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం చిత్రకళా విభాగం కార్యాలయంలో ఉన్నది. తొలి చిత్రంలో రుద్రమ రుమాలు ధరించి ఉండగా ఈ చిత్రంలో రుమాలుతో పాటు కిరీటాన్ని ధరించి ఉంది.
హైదరాబాద్‌లో రుద్రమ
ఆనాటి రాణి రుద్రమ్మ కీర్తికి సంక్షిప్త తార్కాణాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని హైద్రాబాద్ టాంక్‌బండ్‌పై కూడా మూడు దృష్టాంతాలు కనిపిస్తయి. ఒకటి, సికింవూదాబాద్‌నుంచి వస్తూ ఉండగా టాంక్‌బండ్ ప్రారంభంలో ఉన్న తోరణం. ఇది ఓరుగల్లు కోటలో రుద్రమ్మ కట్టించిన నిజమైన తోరణాలకు నకలు. రెండు, టాంక్‌బండ్ ప్రారంభంలో తోరణం పక్కనే ఉన్న అశ్వారూఢ ఖడ్గయుత రుద్రమదేవి విగ్రహం. మూడు, టాంక్‌బండ్ చివరన అంటే హైదరాబాద్ ప్రాంరంభంలో…తోరణానికి ఇరుపక్కలా ఉన్న రాయగజ కేసరి సిమెంట్ శిల్పాలు.
-డా॥ సత్యనారాయణ
మొబైల్: 9490957078

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు