మిస్టరీ కేసు...9 మందిని చంపి బావిలో పడేసారా.. దర్యాప్తుకు ప్రత్యేక బృందం

వరంగల్ నగరం సమీపంలో గొర్రెకుంట ప్రాంతంలో ఓ పాడు పడిన బావిలో లభించిన  9 మంది మృత దేహాల మిస్టరి చేదించేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసారు. మృతుల్లో ఏడుగురు ఒకే్ కుటుంబానికి చెందిన వారు కాగా మరో ఇద్దరు ఇతరులు ఉన్నారు. ముందు రోజు (గురువారం) నలుగురి మృత దేహాలు బయట పడగా శుక్రవారం మరో ఐదు మృత దేహాలు బయట పడ్డాయి.
మృతుల్లో మక్సూద్ ఆయన భార్య భార్య నిషా, కూతూరు బుధ్రా, మనుమడు మక్సూద్ చిన్నకోడుకు సొహైయిల్, పెద్దకుమారుడు మరియు బీహర్‌కు చెందిన శ్రీరాం, శ్యాం లుగా గుర్తించారు. మక్సూద్ ఆయన కుటుంబ సబ్యులు అంతా గన్ని బాలు గోదాంలో పనిచేస్తున్నారు. వీరిది హత్యా లేక ఆత్మహత్య లేక హత్యచేసారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మక్సూద్ గత 20 సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్ నండి వచ్చి ఇక్కడే కుటుంబ సబ్యులతో కల్సిపని చేసుకుంటూ జీవిస్తున్నాడు. కూతురుకు వివాహం కాగా భర్తతో విడి పోయి మక్సూద్ దగ్గరే ఉంటోంది. 
మక్సూద్ కుుటంబానికి బీహార్ యువకులతో సంభందాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్ యువకులు కొందరు ఫరారీల ోఉన్నారని తెల్సింది.
శుక్రవారం సంఘటన స్థలాన్ని వరంగల్ పోలీస్ కమీషనర్ డాక్టర్ రవీందర్ సందర్శించారు. వరంతా వలస కార్మికులు కావడంతో ఉపాధి సమస్యలు ఉండి ఆత్మహత్యలు చేసుకున్నారేమో ననే అనుమానాలు తొలుతు వ్యక్తం అయ్యాయి. ఈ సంఘటన వెనక నేర పూరిత కోణం ఉఁదని పోేలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. బీహార్ యువకులు పట్టుపడితే పూర్తి వాస్తవాలు బయట పడతాయని చెబుతున్నారు.
మంత్రులు యెర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాధోడ్ మృతుల కుటుంబ సబ్యులను పరామర్శించారు.


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు