సహస్ర ఆలయానికి 850 ఏళ్ళు

శిల్పనిర్మాణ రంగాన ప్రపంచస్థాయి కట్టడం వేయిస్తంభాలగుడి.. కాకతీయుల కీర్తికిరీటంలో కలికితురాయిలాంటి త్రికూటాలయం అది. అష్టముఖి పద్ధతిన చేపట్టిన ఈ నిర్మాణానికి ఇప్పుడొక మహాసందర్భం. రుద్రదేవ మహారాజు నిర్మించిన ఈ మండపానికి ఎల్లుండికి 850ఏళ్లు. విశాలవేదికపై స్తంభాలను అద్భుతంగా నిలబెట్టి రూపొందించిన రంగమండపం, పైకప్పులో అష్టదిక్పాలక పరివృత్తుడైన దశభుజరువూదుడు.. హుందాగా నిలిచిన నంది, అబ్బురపరిచే ముఖద్వారాలు..ఇవన్నీ వేయిస్తంభాల ఆలయపు ప్రత్యేకతలే. కాకతీయుల పాలనకు సంబంధించిన ప్రధాన సన్నివేశాలు వేర్వేరు సంవత్సరాల్లో నమోదైనా, వాటి స్మరణకు ఈ ఏడాది వేదికైంది. ఇటీవలే రామప్ప ఆలయానికి 800 సంవత్సరాలు పూర్తికాగా, రాణి రుద్రమ పట్టాభిషిక్తురాలై 750 ఏళ్లయ్యింది. ఇక, వేయిస్తంభాల ఆలయానికి ఇది 850వ సంవత్సరం. శాలివాహనశకం 1084-చివూతభాను సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశిన అంటే ఇప్పటి వాడుక క్యాలెండర్ ప్రకారం జనవరి19, 1163న ఆలయంలో ప్రతిష్ఠాపన జరిగినట్లు చారివూతక ఆధారాలు చెబుతున్నాయి. అంటే ఎల్లుండికి 850ఏళ్లు పూర్తికానున్నాయన్నమాట. ఈ సందర్భంగా వేడుకలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
వరంగల్ కల్చరల్, జనవరి 16 (టీమీడియా): ఓరుగల్లు చరివూతలో 2012-13 సంవత్సరం ఎంతో విశిష్టమైనది. కాకతీయుల చరివూతలో మూడు ప్రధాన ఘట్టాల స్మరణకు వేదికగా మారింది. 31-3-2012 నాటికి రామప్ప దేవాలయానికి 800ఏళ్లు పూర్తయ్యాయి. 2012తోనే రాణి రుద్రమాదేవి సింహాసనం అధిష్ఠించి 750 ఏళ్లు పూర్తయ్యాయి. 19-1-2013నాటికి చారివూతాత్మకమైన హన్మకొండ శ్రీ రుద్రేశ్వరాలయం నిర్మించి, 850 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇలా ప్రసిద్ధమైన మూడు సన్నివేశాలు ఈ 2012-13లో రావడం ఈ ఏడాది విశిష్టతను సంతరించుకొన్నదని ఆచార్య హరిశివకుమార్ వివరించారు. ఈ మూడు విశిష్టమైన సంఘటనలు వేరు వేరు శతాబ్దాల్లో జరిగినప్పటికీ ఈ సంవత్సరంలోనే రావడం విశేషం.
కాకతీయ రాజుల మొదటి రాజధానైన హన్మకొండ కోటకు కూత వేటు దూరంలో, నిత్యం ఆరాధించడానికి వీలుగా వెయ్యి స్తంభాలగుడి నిర్మాణమైంది.
అది శాలివాహన శకం 1084-చివూతభాను సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశి శనివారం అనగా 19-1-1163న నిర్మాణమైంది. కాకతీయ శిల్పరీతికి నిలు సాక్ష్యంగా నిలిచిన ఈ గుడిలో ప్రతిష్ఠించిన శ్రీ రుద్రేశ్వర మహాలింగం అత్యద్భుతం. అంత అందంగా చెక్కిన ఈశ్వరలింగం వంటిది దేశంలోనే మరెక్కడా కనిపించదనడం అతిశయోక్తి కాదు. ఆలయ ముఖ ద్వారాలను చెక్కిన తీరు, రంగమండప స్తంభాల మీద కనిపించే శిల్పరీతి, త్రికూటాలయ నిర్మాణ రీతి, రంగమండప పైకప్పులో కనిపించే అష్టదిక్పాలక పరివృత్తుడైన దశభుజరువూదుడు, ఆలయ ముందుభాగంలో హుందాగా నిలిచి ఉన్న నందీశ్వరుడు, పునర్నిర్మాణంలో ఉన్న కల్యాణ మండపం అన్ని కాకతీయ శిల్పరీతికి సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. అలాంటి అద్భుతమైన దేవాలయం ఈ 19-1-2013నాటికి 850 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నది.
క్రీ.శ. 1262లో రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్య పట్టాభిషిక్తురాలైంది. అంటే ఈ సంవత్సరానికి సరిగ్గా 750 ఏళ్లు పూర్తైంది. తన తండ్రి గణపతి దేవ చక్రవర్తి పాలించిన యావత్ దక్షిణ భారతావనిని పాలించిన మహారాణి ఆమె. తన శౌర్య పరాక్షికమాలతో శత్రువులందరినీ అణచివేసి 27సంవత్సరాల సుదీర్ఘ పాలనను అందించిన పాలనాదక్షురాలు. అంతేకాక 80సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా యుద్ధ రంగంలో నిలిచి పోరాడిన వీరవనిత. ఇటలీ యాత్రికుడైన మార్కోపోలో ప్రశంసలను అందుకొన్న మహారాణి. అలాంటి వీర వనిత కాకతీయ సామ్రాజ్యం సింహాసనం అధిష్ఠించి ఈ సంవత్సరంలోనే 750సంవత్సరాలు పూర్తి అయింది.
కాకతీయ శిల్పకళా రీతికి నిదర్శనమైన పాలంపేట రామప్పగుడి కట్టి 31-3-2012 నాటికి సరిగ్గా 800సంవత్సరాలు పూర్తి అయింది. అందుకే ఈ ఏడాది అష్ట శతాబ్ది ఉత్సవం జరుపుకొంటున్న శుభ సంవత్సరం. గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన శ్రీ రేచర్ల రుద్రసేనాని శక సంవత్సరం 1135-శ్రీముఖ సంవత్సర చైత్ర శుక్ల అష్టమి. ఆదివారానికి సరియైన క్రీ.శ. 31-3-1213న దీనిని ప్రతిష్ఠించారు. ఈ సంవత్సరం సరిగ్గా 800 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నది. ఈ ఆలయంలో కూడా ఉన్న శ్రీ రుద్రేశ్వర మహాలింగం, హన్మకొండలో రుద్రదేవ మహారాజు నిర్మించిన శ్రీ రుద్రేశ్వర మహా లింగంతో పోటీ పడుతున్నదా అన్నట్లు ఉంటుంది. అంతే కాక గర్భాలయ ముఖ ద్వారం తీర్చిదిద్దిన తీరు, రంగ మండప నిర్మాణం, రంగ మండప స్తంభ శిల్పాలు చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఇక ఈ ఆలయంలోని నంది విగ్రహం ‘కాకతీయనందు’లన్నింటికీ తలమానికం. ఆ నందిని ఎటు వైపు నుంచి చూసినా అద్భుతమైన శిల్ప చాతుర్యంతో అందంగాను, హుందాగాను కనిపిస్తుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు