కాకతీయ ఉత్సవాలకు శాస్ర్తీయత లేదు….పరిశోధనల కోసం పీఠం ఏర్పాటు చేయాలి

కాకతీయ ఉత్సవాలకు శాస్ర్తీయత లేదు….పరిశోధనల కోసం పీఠం ఏర్పాటు చేయాలి….చరిత్ర కారుల ప్రాతినిధ్యం ఎక్కడ….యునెస్కో గుర్తింపు ప్రకటనలకే పరిమితం….ఉత్సవాల తీరుపై కె.యు రిటైర్డ్ ప్రొఫెసర్ బొబ్బిలి అగ్రహం…..
వరంగల్:సంవత్సర కాలంపాటు నిర్వహిస్తామంటున్న కాకతీయ ఉత్సవాలపై ఎలాంటి శాస్ర్తీయత లేదు. ఉత్సవాల్లో సంభందం లేని వారిని తీసుకు వచ్చి నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 7 వ తేదీన ముఖ్యమంత్రి కాకతీయ ఉత్సవాలు కాకతీయ సామ్రాజ్యం అంతటా నిర్వహిస్తామని ప్రకటించారు. కర్నాటక, మహారాష్ర్ట మొదలు కంచి వరకు కాకతీయ సామ్రాజ్యం విస్తరించింది. వీటిని విస్మరించి ఉత్సవాలను వరంగల్ వరకే పరిమితం చేశారు. పిఠాపురం, త్రిపురాంతకం, కోనసీమ, గండికోట ప్రాంతాలు కాకతీయ సామ్రాజ్యంలో ఉండేవి. కాకతీయులు సాంస్కృతికంగా సామాజికంగా ఎన్నో మార్పులు తెచ్చారు. ఆరోజుల్లోనే మహిళా సధికారతను గుర్తించి రుద్రమ దేవికి పట్టాబిషేకం జరిపించారు. ఉత్సవాల్లో చరిత్ర కారులు, పరిశోదకులు, పండితులు కనిపించ లేదు. ముఖ్యమంత్రి మంత్రులు సంభధం లేని ప్రకటనలు చేశారు. ఉత్సవాలు ఎలా ఉండాలో దిశా నిర్దేశం చేసినా ఎవరూ పట్టించు కోలేదు. కాకతీయులపై రూ. 40 లక్షలతో డాకుమెంటరి నిర్మాణం చేసేందుకు ఇన్ టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండు రాంగారావుకు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావుకు అప్పగించినట్లు మంత్రి బస్వరాజు సారయ్య ప్రకటన చేశారు. వారికి కాకతీయుల చరిత్ర ఏం తెల్సా?….ఇన్ టాక్ ఫండ్స్ తో పాండురంగారావు ఏంచేశాడు. కాకతీయ కట్టడాలకు యునెస్కో గుర్తింపు తెస్తామని ప్రకటించి ఇప్పటి వరకు ఎలాంటి పరయత్నాలు చేయ లేదు. ఏడాది పాటు నిర్వహిస్తామని చెప్పిన కాకతీయ ఉత్సవాలకు జెండా, ఎజెండా ఖరారు చేయాలి. కాకతీయుల చరిత్రపై పరిశోదనల కోసం ప్రత్యేక పీఠం ఏర్పాటు చేయాలి. శాశ్వత ప్రాతిపదికన అధ్యయనం జరగాలి. ఉత్స,వాలకు చిహ్నంగా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆడి టోరియం నిర్మించాలి. 1930 లో బ్రిటిష్ కాలంలో కాకతీయ కట్టడాలు లెక్కించారు. తిరిగి లెక్కింపు జరిపి కట్టడాల పరిరక్షణక చర్యలు తీసు కోవాలి. ఉత్సవాలలో ఈ ప్రాంత ప్రజలను బాగస్వామ్యం చేయాలి. ఉత్సవాలు ఎంత ముఖ్యమో చారిత్రక కట్టడాలు భావి తరాలకు భద్ర పరడం కూడ అంతే ముఖ్యం. ప్రదానంగా ఉత్సవాలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి.
December 26, 2012

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు