కరోనా కాలంలో వివాహం...కేవలం 12 వేల ఖర్చు

కరోనాకాలంలో వివాహాలు జరిగితే ఆర్భాటాలు లేక పోవడంతో సాదా సీదాగా జరిగి పోతుంది. అవును హైదరాబాద్ లో ఓ వివాహం సింపుల్ గా రూ 12 వేలఖర్చుతోే జరిగింది. చందానగర్‌లో ఎస్‌మాక్స్‌ హెచ్‌ఆర్‌ ఉద్యోగి తొట్టెంపూడి నరేంద్రబాబు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని వాసిరెడ్డి మౌనిక శనివారం వివాహం చేసుకున్నారు. వీరు బంధువులే.. మనసులు కలవడంతో పెళ్లి చేసుకుందామని మార్చి నెలలో నిశ్చయించుకున్నారు. ఈలోపు లాక్‌డౌన్‌తో వివాహం వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా హంగు, ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకుందామని నరేంద్రబాబు, మౌనిక నిర్ణయించుకున్నారు. శనివారం చందానగర్‌ శ్రీటవర్స్‌ అపార్ట్‌మెంట్‌లోని వధువు ఇంట్లో నిరాడంబరంగా పెళ్లి జరిపించేశారు. కేవలం వధువు, వరుడి తల్లిదండ్రులతో సహా పది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు